SIR పూర్తి చేసిన వారికి నగదు బహుమతులు.. తొలి బహుమతి రూ.10 వేలు

ప్రతిపక్షం, జూలై 18: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ప్రక్రియను గడువులోగా వేగంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా వీపనగండ్లలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఎల్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

SIR ప్రక్రియ మందకొడిగా సాగుతున్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వలస వెళ్లిన ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వారి వివరాలను సేకరించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, వేగంగా పూర్తి చేసే సిబ్బందిని ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తొలి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు నగదు పురస్కారం అందిస్తామని తెలిపారు.

Spread the love

Related News

Latest News