ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని.. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు.