Trending Now

ఏఐ ఎంఐఎం తో పొత్తుకై బీఆర్ఎస్..!

నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్‌ను కలిసిన బీఆర్‌ఎస్ కీలక నేతలు

తుది నిర్ణయం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీదే..

ప్రతిపక్షం ,జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 25 : ఆల్ ఇండియా మజ్లిస్ ఎత్తేహాదుల్ ముస్లిం (ఏఐఎంఐఎం) పొత్తు కుదిరించుకున్నందుకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్ నివాసానికి రాష్ట్ర మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విటల్ ఆదిలాబాద్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు గురువారం రాత్రి చేరుకున్నారు. వారికి ఏఐఎంఐఎం శ్రేణులు సాధారణంగా స్వాగతం పలికి శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ప్రతిష్టాత్మకంగా మారిన ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ప్రగాఢ విశ్వాసం, ఆశతో ఉన్న బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలు సూచనల మేరకు పై నేతలు పొత్తు విషయమై గంటన్నర పాటు ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్షులు జాబిర్ అహ్మద్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మెల్సీ దండే విట్టల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కులు పలు విషయాలను చర్చించారు.

అయితే ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు జాబీర్ అహ్మద్ మాత్రం పొత్తు విషయమై తాము వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని అధిష్టాన నిచ్చే ఆదేశాలు నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తుది నిర్ణయం ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీదే ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాలు సూచనల మేరకే పార్లమెంట్ ఎన్నికలలో ఏఐఎంఐఎం తనదైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ కొత్త విషయమై కాంగ్రెస్ ఆగ్ర స్థాయి నేతలు కూడా పలుమార్లు తమతో చర్చించినప్పటికీ సరైన స్పష్టత లేక తాము ఎవరికి ఎలాంటి భరోసా కల్పించలేకపోతున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో ఆదిలాబాద్ పట్టణ ఏఐఎంఐఎం అధ్యక్షులు మహమ్మద్ నజీర్,భైంసా పట్టణ అధ్యక్షులు ఫైజుల్లాహ్ ఖాన్, పలురు ఎంఐఎం కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.

అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయమే తుది నిర్ణయం..!

ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు జాబిర్ అహ్మద్..!

అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ముస్లింల ఓట్లు అత్యధికంగా ఉన్నాయని ఏఐఎంఐఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు బైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ అహ్మద్ పేర్కొన్నారు. నిర్మల్ ,ముధోల్, బోథ్ ,ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఖానాపూర్, ఆసిఫాబాద్‌లలో అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించేలా ముస్లీం మైనార్టీల ఓట్లు ఉన్నాయని చెప్పారు. సుమారు మూడు లక్షల అరవై వేల ఓట్లు ముస్లిం మైనార్టీలై అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయని అయితే కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలు తమకు ఎలాగైనా ఓట్లు వేస్తారని దురుద్దేశంతో తమను కనీసం సంప్రదించడం కూడా లేదని పేర్కొన్నారు. మా జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీసుకునే తుది నిర్ణయమే పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వాలో ఆ అభ్యర్థి అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది పేర్కొన్నారు. జిల్లాలోని ముస్లిం మైనార్టీలు దళితులు క్రైస్తవులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు ప్రస్తుతమున్న రాజకీయ ఆందోళనకరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలలో ఏక నిర్ణయంతో ఐక్యతతో తమ భవిష్యత్తు రక్షకులు, సంక్షేమ దారులు ఎవరో గుర్తించి వారికి ఓటు వేసేలా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

Spread the love

Related News