•”సర్”ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్న ఓటర్లు
•చిలుకటోనిపల్లిలో 100శాతం పూర్తయిన ఓటర్ జాబితా సవరణ
ప్రతిపక్షం,జులై 18,వనపర్తి ప్రతినిధి: పారదర్శక ఓటర్ జాబితా…బలోపేత ప్రజాస్వామ్యం పేరిట సామాజిక బాధ్యతతో మాజీ మంత్రి.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాగిస్తున్న ఓటర్ జాబితా సవరణ ఒక యజ్ఞంలా సాగుతూ గ్రామాల్లో ప్రజలు చురుకుగా “సర్”ప్రక్రియలో పాల్గొంటున్నారు.నిత్యం రాజకీయ విమర్శలతో చులకనౌతున్న తరుణంలో సామాజిక భాద్యతగా తీసుకొని నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను అప్రమత్తం చేస్తూ బిఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తూ ప్రజ్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని,ప్రజా సంక్షేమ పాలన రావాలంటే ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా సాగాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.పెద్దమందడి మండలంలో పర్యటిస్తూ చిలకటోనీపల్లి గ్రామంలో “సర్”ఓటర్ జాబితా సవరణ జరుగుతున్న విధానాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న 383 ఓటర్ల వివరాలు చనిపోయిన ముగ్గురి వివరాలతో పాటు 100కు 100శాతం ఆన్ లైన్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఓటర్ జాబితా సవరణ పూర్తి కావడానికి కృషి చేసిన సర్పంచ్ అశ్విత రమేష్, బిఎల్ఓ మంజుల,బిఆర్ఎస్ పార్టీ బిఎల్ఎలను ఘనంగా సన్మానించి అభినందించారు.జిల్లాలో చిలకటోనీపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు.చిలకటోనీపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని గడువులోపు ఓటర్ జాబితా సవరణను పూర్తి చేసి ప్రజాస్వామ్యస్పూర్తికి నాంది పలకాలని అన్నారు.నిరంజన్ రెడ్డి వెంట మాజీ జిల్లా రైతు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి రఘుపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్,ఉప సర్పంచ్ చిన్న రాములు తదితరులు పాల్గొన్నారు.
















