Trending Now

ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలు..

పరామర్శించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

ప్రతిపక్షం, బోథ్ ప్రతినిధి, మే 23 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో నిన్న సాయంత్రం అకాల వర్షం, ఈదురు గాలులతో దెబ్బతిని పంటల వల్ల నష్టపోయిన రైతులను, ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క భరోసానిచ్చారు. బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్, జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్ తో కలిసి మండలంలోని ఝరి, పూణగూడ, మందగూడ, ఉమ్రీ, తదితర గ్రామాల్లో ఆకాల వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఇళ్ళు కూలిపోయి నష్టపోయిన రైతుల, కుటుంబలకు ప్రభుత్వం తరుఫున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి.. ఆదుకుంటామని భరోసా కల్పించారు.

అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు వినతి పత్రం అందించారు. తక్షణమే బాధితులకు నష్టపరిహారం అందించి.. నిత్యవసర సరుకులు ఇవ్వాలని కోరారు. వారితో పాటు వైస్ ఎంపీపీ దివ్య మాధవ్, ఎంపీటీసీ రమేష్ రెడ్డి, కమలాకర్, వెంకన్న యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ రావు, మాజీ సర్పంచ్లు గంగారం, రఘు, తిరుపతి, మాజీ ఎంపీపీ రాము, ప్రతాప్, శ్రీనివాస్, దేవ్ రావు, మోహన్ రెడ్డి, రాజు, నర్సింహులు, జ్ఞానేశ్వర్, కాంత రావు తదితరులున్నారు.

Spread the love

Related News

Latest News