•అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
•వనపర్తి డిసిసి చీఫ్, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ప్రతిపక్షం, జూన్ 27, వనపర్తి ప్రతినిధి: గిరిజనుల సామాజిక, రాజకీయ సాధికారతకు పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి గిరిజనుల అభ్యున్నతికి మార్గం సుగమం చేసిన మహానేత ఇందిరా గాంధీ అని, అలాగే గిరిజనులను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న పార్టీ కాంగ్రెస్ అన్ని శివసేన రెడ్డి అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో లంబాడీ, ఎరుకలి, యానాది, గిరిజన ఆదివాసి వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వర్ణోత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లాకు ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర రావడంతో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి లు ఘనంగా స్వాగతం పలికారు. పానగల్ రోడ్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీతో వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బస్సు యాత్ర కు సంబంధించి సమావేశంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు,ఎంపీలు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిసిసి చీఫ్, శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ… లంబాడి ప్రజలంతా ఒక నమ్మకంతో, ధైర్యం, బలంతో ముందుకెళ్తారని, మాట ఇస్తే మడమతిప్పరనీ శివసేన రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని అన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణన నిర్వహించి సామాజిక న్యాయానికి కొత్త దిశ చూపించబోతున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రజల ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగుతామన్నారు. సామాజిక న్యాయం సమాన అవకాశాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు.రిజర్వేషన్ల ద్వారా వేలాది మంది విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగంలో ఎదిగి సమాజంలో గౌరవప్రదమైన స్థానం గిరిజనులు సంపాదించారని గుర్తు చేశారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, శరవంద, కోళ్ల వెంకటేష్, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ఈరపొగు రాజ్ కుమార్, పాండు సాగర్, గిరిజన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.


















