Trending Now

గేట్ పరీక్ష ఫైనల్ ‘కీ’ విడుదల..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న గేట్‌ పరీక్ష తుది ‘కీ’ విడుదలైంది. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. గత నెలలో రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ ‘కీ’ ని అందుబాటులోకి తెచ్చారు. షెడ్యూల్ ప్రకారం రేపు గేట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.

Spread the love