Bangladesh all out for 149 in first innings: చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులు ఎత్తేశారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్(32) పరుగులతో రాణించగా.. మిరాజ్(27), లిట్టన్ దాస్(22), నజ్ముల్ షాంటో(20) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక, భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 6 వికెట్లకు 339 పరుగులు చేయగా.. రెండో రోజు కేవలం 37 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) పరుగులు చేశారు. తర్వాత బంగ్లాదేశ్ 149 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బంగ్లాదేశ్‌పై భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం లభించింది.