‘రైతును కాపాడిన కోతి’ కథ ఎంపిక..
నేహకు అభినందనల వెల్లువ
ప్రతిపక్షం, నంగునూరు/నారాయణరావుపేట, అక్టోబరు 29: జాతీయ స్థాయి కథల పోటీలో లక్ష్మీదేవి పల్లి విద్యార్థిని ఉడుత నేహ తన కలానికి పదును పెట్టి సత్తా చాటింది. బాలల దినోత్సవం సందర్భంగా ‘బాల చెలిమి’ నిర్వహించిన పోటీలో ఆమె రచించిన ‘రైతును కాపాడిన కోతి’ కథ ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందింది. తొమ్మిదో తరగతిలోనే జాతీయస్థాయి పోటీలో తన రచనకు చోటు దక్కించుకున్న నేహను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఆమెకు మార్గనిర్దేశం చేసిన తెలుగు ఉపాధ్యాయుడు పిన్నింటి మహేంద్రారెడ్డిని ప్రశంసించారు. సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట గ్రామీణ మండలం, లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉడుత నేహ జాతీయ స్థాయి కథల పోటీలో తన ప్రతిభను చాటుకుంది. ‘బాల చెలిమి’ నిర్వహించిన పోటీలో ఆమె రచించిన ‘రైతును కాపాడిన కోతి’ కథ ఎంపికైంది. తొమ్మిదో తరగతి చదువుతున్న నేహ సాధించిన ఈ ఘనత పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
లక్ష్మీదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ చదువుతున్న నేహ కథల పోటీలో పాల్గొని తన సృజనాత్మకతను చాటింది. విద్యార్థి దశలోనే రచనపై ఆసక్తి పెంచుకుని జాతీయస్థాయి పోటీలో గుర్తింపు పొందడం విశేషం. ఆమె విజయం తోటి విద్యార్థుల్లోనూ సాహిత్యంపై ఆసక్తిని పెంపొందించనుంది.ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎం.గౌరీ మోహన్, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయుడు ఎ.శ్రీనివాసులు, గ్రామ సర్పంచి పోతుల రమేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేకల ప్రమీల నేహను అభినందించారు. కథా రచనలో ఆమెను ప్రోత్సహించి, మార్గనిర్దేశం చేసిన తెలుగు ఉపాధ్యాయుడు పిన్నింటి మహేంద్రారెడ్డిని ప్రశంసించారు.విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు. చదువుతో పాటు సాహిత్యం, సృజనాత్మక రచనలపై ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో నేహ మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నేహ సాధించిన విజయంపై పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.





























