Trending Now

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ల గట్టు పంచాయితీలు..

ప్రాజెక్టుల గట్టుపై ఒకరిపై ఒకరు ఆరోపణలు

రంజుగా సాగుతున్న ప్రాజెక్టుల పోటాపోటీ పర్యటనలు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: అధికార కాంగ్రెస్​, ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్​లు ప్రాజెక్టు గట్లు వేదికగా పంచాయితీకి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికలకు ముందు కాలేశ్వరం మహా అద్భుతమని బీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేశారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రధాయిని అంటూ కితాబ్బిచ్చారు. సీన్​ కట్​ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మెజార్టీ రావడం, ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మహా అద్భుతమని అనుకున్న తెలంగాణ ప్రజలకు ఇది లోపభూయిష్ట ప్రాజెక్టు అంటూ అధికార కాంగ్రెస్​ ప్రభుత్వం తెలపడంతో ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు కట్టడాలు పగుళ్లు రావడం, కుంగిపోవడం వల్ల నీరు నిల్వ ఉండడం లేదని స్పష్టం అయ్యింది.

అయితే కాళేశ్వరంపై ముందునుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్​ నేతల ఆరోపణలు నిజమయ్యాయి. బీఆర్​ఎస్​ పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంలో సీఎంతో పాటు కాంగ్రెస్​ నేతలు సక్సెస్​ అయ్యారు. అయితే ప్రజల్లో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని భావించిన బీఆర్​ఎస్ ఉనికిని కాపాడే యత్నంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు నడుంభిగించింది. ఇటు బీఆర్​ఎస్​ కాళేశ్వరం అటు కాంగ్రెస్​ ఛలో పాలమూరు.. అంటూ బయలు దేరాయి. దీంతో రాష్ట్రంలో ప్రాజెక్టుల గట్టుమీద పంచాయితీ జోరుగా సాగుతోంది.

బీఆర్ఎస్.. ఛలో మేడిగడ్డ, కాంగ్రెస్ ఛలో పాలమూరు.. ఇలా.. ప్రాజెక్ట్ వార్ తెలంగాణలో మళ్లీ కాకరేపుతోంది. ఇవాళ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో మేడిగడ్డ.. పాలమూరు ప్రాజెక్టులపై పొలిటికల్‌ హీట్‌ నెలకొంది.

పదేళ్లు పాలమూరుపై నిర్లక్ష్యం: కాంగ్రెస్​

గత పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డిపై నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎండగట్టారు. మహబూబ్​నగర్​ లోక్​సభ కాంగ్రెస్​పార్టీ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంశీచంద్​రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల స్థితిగతులను ప్రజలకు వివరించారు. మేడిగడ్డకు కౌంటర్‌గా పాలమూరు నినాదం ఎత్తుకోవడంపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. విషయాన్ని డైవర్ట్ చేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందనేది బీఆర్‌ఎస్ ఆరోపణ.దొంగే దొంగ అన్నట్టు బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సింది పోయి.. ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ మండిపడుతోంది.మొత్తంగా అటు మేడిగడ్డకు బీఆర్‌ఎస్.. ఇటు పాలమూరుకు కాంగ్రెస్. ఈ రెండు పార్టీల పోటా పోటీ పర్యటలు తెలంగాణలో కాకపుట్టింది.

పగులు బాగుచేయోచ్చు: బీఆర్​ఎస్​

మేడిగడ్డ బరాజ్​ పగుళ్లు పడితే, కుంగితే దాన్ని బాగు చేసి రైతులకు నిళ్లు ఇవ్వొచ్చని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్​ చేశారు. తెలంగాణకు వరప్రధాయిని అయిన కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా మూసి వేసే ప్రయత్నం కాంగ్రెస్​ చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​పార్టీ నేతలకు మాపై కోపం ఉంటే తీసుకోవాలని, రైతులపై చూపొంద్దంటూ ఆయన అన్నారు. అయితే ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన మరమ్మత్తులు చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. ఇప్పటికి కాలేశ్వరం తెలంగాణాకు వరప్రధాయినేనని ఆయన ఫవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు.

Spread the love