Trending Now

Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత!

Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్, దగ్గుతో బాధ పడుతున్నారు. అయితే, అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్‌ క్లోరినేషన్‌ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్‌కి వరద ముప్పుపై ఆరా తీశారు.

Spread the love

Related News

Latest News