ప్రతిపక్షం, జూన్ 02: ప్రముఖ నటి త్రిష తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో ఆసక్తికరమైన సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇటీవల ఆమెపై వస్తున్న పుకార్లపై నేరుగా స్పందించకపోయినా, తన పెంపుడు కుక్క ఫొటోతో చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది.
“నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు దీనికి మాత్రమే అనుమతి ఉంది” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విమర్శలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు.
త్రిష చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతుండగా, ఆమె అభిమానులు మద్దతుగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

















