ప్రత్యేక పూజలు నిర్వహించిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 26 : ముధోల్ మండలం లోని వెంకటాపూర్ గ్రామం లో శ్రీ వెంకటేశ్వరా స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత భక్తి ప్రభత్తులతో జరిగింది. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేద పండితులు అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పదేళ్ల కాలంలో నియోజకవర్గంలోని అనేక దేవత దేవాలయాల ను శోభయామానంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఆలయాల అభివృద్ధికి సముచిత ప్రాధాన్యతనిస్తూ.. ఉండడం జరిగిందని ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ భూమయ్యలతోపాటు గ్రామ అభివృద్ధి కమిటీ పదాధికారులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.