Trending Now

అంతర్ జిల్లా వరి ధాన్యం దొంగల ముఠా అరెస్టు..

ప్రతిపక్షం: సిద్దిపేట, మార్చి 7:
జిల్లాలో వరుసగా వడ్ల ధాన్యాన్ని దొంగిలిస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు. పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేయగా, కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి కొండపాక చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. తోగుట సీఐ లతీఫ్ నిందితుల వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన పోతుల సుధాకర్, సున్నపు దేవేందర్, సాగాని నవీన్ లు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి ధాన్యాన్ని దొంగిలించి వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారు. సిరిసినగండ్ల, బొంపల్లి, సామర్లపల్లి ,పెద్ద మాసంపల్లి, చిన్న ఆరేపల్లి, కృష్ణ సాగర్, వెంకట్రావు పేట, కొత్తపల్లి, కొండపాక తదితర ప్రాంతాల్లో వరి ధాన్యం బస్తాలను దొంగతనం చేసినట్లు తెలిపారు. వీటితోపాటు కల్టి వేటర్ ట్రాక్టర్ ను కూడా దొంగతనం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుండి లక్షా నలభై వేల నగదు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కాగా కేసును ఛేదించిన పోలీసులను పోలీస్ కమీషనర్ అనురాధ అభినందించారు. ఈ సమావేశంలో కుక్కునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్,సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love