ప్రతిపక్షం, జూన్ 04: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమ వేదికగా ఆయన ప్రకాశ్‌రాజ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన బండ్ల గణేశ్, ముందుగా తన గురించి తాను తెలుసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

















