*ఆలయాల్లో పూజలు – కాటన్ మిల్లులు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలు.
ప్రతి పక్షం మునుగోడు, అక్టోబర్ 12: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
*శివరామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు:ఉదయం మునుగోడు పట్టణంలోని శ్రీ శ్రీ శివరామ క్షేత్రాన్ని దర్శించుకుని శివుడికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
*కాటన్ మిల్లుల ప్రారంభోత్సవం:నారాయణపూర్ మండలం పుట్టపాకలో నూతనంగా నిర్మించిన తేజ కాటన్ మిల్స ను, చండూరు మండలం తస్కాని గూడెంలో శ్రీ వర మహాలక్ష్మి కాటన్ మిల్లు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఇలాంటి మిల్లులు దోహదపడతాయని అన్నారు.
*షాపింగ్ మాల్ ప్రారంభం: మునుగోడు పట్టణంలోని నల్గొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నిత్య లక్ష్మి షాపింగ్ మాల్ ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
*ఇందిరమ్మ గృహప్రవేశం: గట్టుప్పల్ మండలం కమ్మగూడెంలో మెరుగు శ్రీలత సతీష్ ల నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వారి చిన్నారులను ఆశీర్వదించారు.
*పట్టు వస్త్రాలంకరణ వేడుక: మర్రిగూడెంలోని శ్రీ విజయ గార్డెన్స్ లో జరిగిన తన వ్యక్తిగత సహాయకుడు మాధగోని మధు సోదరుడు మాధగోని సైదులు దీపికల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.








































