ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హీరోయిన్ తాప్సీ, తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. మథియాస్‌తో గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తాప్సీ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తాప్సీ నటనకు అందానికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆతర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ప్రభాస్ తో కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కూడా అందుకుంది.