ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తనకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందంటూ హీరోయిన్ సాయిపల్లవి తన మనసులోని మాటను బయటపెట్టారు. తన అభిరుచికి తగ్గట్లు కథను రెడీ చేస్తోందట. అయితే అది ప్రస్తుతం ఆలోచన మాత్రమేనని.. సినిమాకు నిర్మాతలెవరో తెలియదని, తెలిశాక అందరికీ చెబుతానని పేర్కొంది. కాగా, ప్రస్తుతం తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ తర్వాత అమిర్‌ఖాన్ కుమారుడు హీరోగా రూపొందుతున్న సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.