ప్రతిపక్షం, జూలై 28: తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తరణలో భాగంగా మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించినట్లు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇప్పటికే 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించిన పార్టీ, రెండో విడతలో మరో 19 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించింది.
ఈ విడతలో కూడా బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది. మొత్తం 19 అసెంబ్లీ ఇన్‌ఛార్జీలలో 10 మంది బీసీ నాయకులకు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా 9 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఇన్‌ఛార్జీలను నియమించింది.
పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల నియామకాలను కూడా ప్రకటించింది.
మహిళా విభాగం:
- రాష్ట్ర అధ్యక్షురాలు: పడాల మనోజ గౌడ్
- ప్రధాన కార్యదర్శి: కనగల చైతన్య
- ఉపాధ్యక్షురాలు: అయిలి కవిత
విద్యార్థి విభాగం:
- రాష్ట్ర అధ్యక్షుడు: జానపాటి రాము యాదవ్
- ప్రధాన కార్యదర్శి: మునుకుంట్ల నవీన్ గౌడ్
- ఉపాధ్యక్షురాలు: చింతలపాటి రాధశ్రీ
బీసీ విభాగం:
- రాష్ట్ర అధ్యక్షుడు: అల్లంపల్లి రామకోటి
- ప్రధాన కార్యదర్శి: గొరిగె నర్సింహా
- ఉపాధ్యక్షులు: కుసుమ రజిత, ఈదులకంటి శైలజ గౌడ్
అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా నియమించింది. గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నడిపెల్లి వెంకటేశ్వరరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా కుందూరు దేవేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలిగా సుమలత సుధాకర్ శర్మను ప్రకటించింది.
సంస్థాగత బలోపేతంతో పాటు సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించే దిశగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలంగాణ రక్షణ సేన వెల్లడించింది.
























