సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ బీజే ఎల్బీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని బీజే ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒకే గ్యారెంటీని కూడా సకాలంలో అమలు చేయని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మోయలేని హామీలు చేయలేని పనులు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అనేక వినూత్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సుస్థిరం పదేళ్ల పాలనను అందించిన నరేంద్ర మోడీ ని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకుందామన్నారు.
చిట్యాల ప్రజలు తనకిచ్చిన ఆధార అభిమానాలతోనే ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికవ్వడం జరిగిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదేళ్ల పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటుంటే స్థానిక ఇతర పక్షాలనేతలు అయన పై లేనిపోని అబండాలు మోపడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ అవినీతి అక్రమాలు పెరిగిపోయి దేశం అధోగతి పాలవుతుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పై తనకు అన్ని విధాల అవగాహన ఉందని ఇప్పటికే పలుమార్లురాష్ట్ర మంత్రిగా, ఎంపీగా గెలుపొందిన నేను కోట్లాది రూపాయలతో సదరు ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. తనకు మరోసారి అవకాశం కల్పిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటినీ తీర్చేందుకు మీ అందరి ఆశీస్సులతో కష్టపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు, వి సత్యనారాయణ గౌడ్ , పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య ,పెద్దపల్లి బీజేపీ ఇంచార్జ్ రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, వడ్డీ రెడ్డి రాజేందర్ రెడ్డి, మహమ్మద్ జమాల్, ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.