ఢిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ.. భవిష్యత్ వ్యూహాలపై చర్చ

ప్రతిపక్షం, జూన్ 08: ఢిల్లీలో ఇండియా కూటమి నేతల కీలక సమావేశం కొనసాగుతోంది. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి 23 మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు.కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

రానున్న ఎన్నికలు, పెరుగుతున్న ధరలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR), మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే కేంద్రంలోని NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

అయితే DMK తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, AAP వ్యూహాత్మక కారణాల వల్ల ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల ఐక్యత, భవిష్యత్ రాజకీయ వ్యూహాల దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి కార్యాచరణపై ఈ భేటీ ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News