గూస్‌బంప్స్‌ గ్యారంటీనా?.. ‘ఫౌజీ’లో నేతాజీ సైనికుడిగా ప్రభాస్‌?

ప్రతిపక్షం, జూలై 21: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఆసక్తికర వార్త ఒకటి వైరల్‌గా మారింది. స్వాతంత్య్ర పోరాట సమయంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో సైనికుడిగా ప్రభాస్‌ కనిపించనున్నట్లు సమాచారం.

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరులోని ‘ఫౌజ్‌’ నుంచే ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చారిత్రక నేపథ్యం, దేశభక్తి, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ప్రభాస్‌ అభిమానులకు సినిమా గూస్‌బంప్స్‌ తెప్పించడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News