గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి.. చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం

ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3)కు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సవరణ అమల్లోకి వస్తే గ్రామ పంచాయతీలు తమ పరిధిలోని అభివృద్ధి పనులకు నిధులను మరింత సులభంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీలు ట్రెజరీలో జమ చేస్తున్నాయి. అవసరమైన సమయంలో ఆ నిధులను వినియోగించేందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి రావడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News