Trending Now

హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: క్రికెటర్ విరాట్ కోహ్లీకి వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది ‘వన్ 8 కమ్యూన్’ రెస్టారెంట్ నెట్‌వర్క్. బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్లు ఇప్పటికే ఏర్పాటవగా, ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభించబడింది. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో ప్రారంభించినట్లు విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

2017 నుంచి వన్‌ 8 కమ్యూన్‌ పేరుతో రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విరాట్‌.. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, బెంగళూరులో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న కోహ్లీ.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తనకు వన్‌ 8 కమ్యూన్ అనేది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదని.. హైదరాబాద్‌ ప్రజలను ఒకేచోటుకు చేర్చడం ఈ రెస్టారెంట్‌ ముఖ్య ఉద్దేశం అని చెప్పుకొచ్చారు.

Spread the love

Related News

Latest News