ఉప్పల్ భూ పంపిణీ పోరాటం ధర్నాకు వెళ్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులను అడ్డుకున్న పోలీసులు

ప్రతిపక్షం,సిద్దిపేట టౌన్,జూలై 3: ఉప్పల్‌లో నిర్వహించిన భూ పంపిణీ పోరాటం ధర్నాలో పాల్గొనేందుకు సిద్దిపేట జిల్లా నుంచి బయలుదేరిన తెలంగాణ రక్షణ సేన నాయకులను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.

జిల్లా ఇన్‌చార్జి గ్యాదరి గిరి, కమలాకర్ రెడ్డి, అజయ్, రాజు, బాబు, శేఖర్ తదితర నాయకులు ధర్నాకు వెళ్తుండగా పోలీసులు వారిని నిలిపివేసి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు.

అలాగే ఉప్పల్‌లో జరిగిన ధర్నాలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్రంగా ఖండించారు. భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన శాంతియుత ఆందోళనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు “జై తెలంగాణ” నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News