ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సీఎం జగన్ ఇవాళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రూ.862 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్, మెమోరియల్ పార్క్, ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్-1, వైఎస్సార్ జంక్షన్ ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.