అమరవీరుల త్యాగాలకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ప్రతిపక్షం, జూన్ 02: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్న సీఎం, వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని అన్నారు.

అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News