Trending Now

ఉత్సవాలకు మాజీ మంత్రి హరీష్ రావుకు పిలుపు..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 13: సిద్దిపేట నియోజకవర్గంలో శ్రీరామ నవమి, పెద్దమ్మ పోచమ్మ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు రావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. సిద్దిపేట పట్టణం పారుపల్లి వీధిలోని సుప్రసిద్ధ క్షేత్రం శ్రీ రామాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు, చింతమడకలోని శ్రీ పట్టాభి రామాలయంలో ఉత్సవాలకు, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ హనుమాన్ దేవాలయం, హరిప్రియ నగర్ లోని శ్రీ అభయ్ ఆంజనేయ స్వామి దేవాలయం, ఎల్లాయ్ పల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయ, చింతమడకలోని పోచమ్మ దేవాలయం లో జరిగే ఉత్సవాలకు రావాలని ఆలయాల ప్రతినిధులు, ముదిరాజ్ కుల సంఘం ప్రతినిధులు ఆహ్వానం పలికారు.

చింత‌మ‌డ‌క‌లోని రామాల‌యం ప్ర‌త్యేక‌త..

ఆలయ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. తమిళనాడుకు చెందిన 150 మంది శిల్పులు ఈ మహత్కార్యంలో పాలుపంచుకున్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలు శ్రమించి ఓ రూపునిచ్చారు. మూలవిరాట్‌ తమిళనాడులోని మహాబలిపురంలో రూపుదిద్దుకుంది. పట్టాభిరాముడి పరివారాన్నంతా ఏకమూర్తిగా తీర్చిదిద్దడం ఇందులోని ప్రత్యేకత. సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్‌ సమేత రామచంద్రస్వామితోపాటు బ్రహ్మ, ఈశ్వరుడు, వినాయకుడు, వశిష్ఠ, నారద మునీంద్రుల మూర్తులను ఇమిడ్చిన తీరు అబ్బురపరుస్తుంది. వనవాసం తర్వాత శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన పుష్యమి నక్షత్రంనాడే చింతమడకలో పట్టాభిరాముడి ప్రతిష్ఠ జరుగుతుండటం విశేషం.

Spread the love

Related News

Latest News