Trending Now

మున్నూరు కాపు సంఘ సర్వసభ్యుల సమావేశం.. కమిటీ సభ్యులు ఎంపిక

నిర్మల్, (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 15 : నిర్మల్ జిల్లా బైంసా పట్టణ మున్నూరు కాపు సంఘ సర్వ సభ్యుల సమావేశం స్థానికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైంసా టౌన్ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుపోతుల మల్లేష్ ను మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన బైంసా టౌన్ పట్టణ అధ్యక్షుడు ఎన్పోతుల మల్లేష్ మాట్లాడుతూ.. నేను అందరి సహకారులతో నేను దగ్గరుండి కృషి చేస్తానని ఆయన దైవ సాక్షిగా తెలిపారు. అదేవిధంగా నేను ఎటువంటి తప్పు చేయనని పేర్కొన్నారు. నేను మున్నూరు బిడ్డను మున్నూరు కాపు గురించే కొట్లాడుతాను.. ఆపదలో ఉన్నవారికి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

ఈరోజు బైంసా పట్టణంలోని గణేష్ నగర్లో మున్నూరు కాపు సంఘంలో బైంసా పట్టణానికి చెందిన మున్నూరు కాపు టౌన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ అధ్యక్షులుగా భజనోళ్ల గంగాధర్ అధ్యక్షునిగా ఎనిపోతుల మల్లేష్.. అదేవిధంగా పట్టణానికి చెందిన ఏడు సంఘాల కమిటీ పెద్దలు వాళ్ల నిర్ణయం మేరకు ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు పురాణ బజారుకు చెందిన ఉపాధ్యక్షుడిగా మడుగుల సాయినాథ్ ను నియమించారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆకుల గోపాల్, కోశాధికారిగా తూముల దత్తు, ఎన్నికగా కాబడినది. సలహాదారులు డాక్టర్ అల్లం పోశెట్టి కార్యదర్శి గా ఆకులగోపాల్, న్యాయ సలహాదారులు మురళి అడ్వకేట్, మున్నూరు కాపు సంఘం భైంసా పట్టణ సమక్షంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కృష్ణ కాలనీ సాయినాథ్ గాలి రవి, కోరువ చిన్నన్న, సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News