ప్రతిపక్షం, జూన్ 17: జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ భాగస్వామ్యాల విజయానికి పరస్పర విశ్వాసమే కీలకమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న నేపథ్యంలో నమ్మకం, సహకారం మరింత అవసరమని అన్నారు.
ప్రస్తుతం దేశాల మధ్య విశ్వాస లోపం పెరుగుతోందని, దానిని పునర్నిర్మించడంపైనే భవిష్యత్ భాగస్వామ్యాల విజయాపజయాలు ఆధారపడి ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూసే భారతీయ తత్వాన్ని ప్రస్తావిస్తూ, అన్ని దేశాలు సమాన భాగస్వాములుగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమిష్టి సహకారం, పరస్పర గౌరవం, నమ్మకంతోనే ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన అభివృద్ధి సాధించగలమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

















