ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణం.. తెలంగాణ గురుకుల విద్యార్థినికి సీఎం అభినందనలు

ప్రతిపక్షం, జూలై 18: చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్‌-23 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2026లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ గురుకుల విద్యార్థిని నరిమళ్ల ప్రవల్లికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. మహిళల 4×400 మీటర్ల రిలే విభాగంలో బంగారు పతకం సాధించి దేశానికి, తెలంగాణకు గర్వకారణంగా నిలిచినందుకు ఆమెను ప్రశంసించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఉన్నతాధికారులతో కలిసి ప్రవల్లిక ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆమెను సీఎం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు క్రీడలు, విద్యా రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News