Trending Now

రైల్వే లైన్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి..

జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 10: రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ మరియు రైల్వే శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే నిర్మాణంలో భాగంగా చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నకోడూరు మండలం లోని పెద్ద కోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాలు మరియు నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది, జక్కాపూర్ గ్రామాలలో మొత్తం 25 ఎకరాల 30 గుంటల భూమి ఇంకా రైల్వే నిర్మాణానికి సేకరించాల్సి ఉన్నందున ఆయా మండలాల తాసిల్దార్లు మరియు సిద్దిపేట ఆర్డీవో ప్రత్యేక శ్రద్ధచూపి త్వరగా భూసేకరణ చేసి రైల్వే అధికారులకు రైల్వే నిర్మాణం కోసం అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్, సిద్దిపేట అర్బన్, నారాయణరావుపేట, చిన్నకోడూరు తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News