తెలంగాణలో SIR గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు

ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–SIR) గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ నెల 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (సీఈఓ) ఆదేశాలు జారీ చేసింది.

ఓటరు నమోదులు, మార్పులు, తొలగింపులు, సవరణల ప్రక్రియను మరింత సమగ్రంగా పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచేసుకునేందుకు మరో అవకాశం లభించింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎస్‌ఐఆర్ గడువును ఇటీవల ఈ నెల 24 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News