సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ప్రతిపక్షం, జూన్ 02: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వాహనం లారీ కింద ఇరుక్కుపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మృతులను మణుగూరుకు చెందిన కలిపాక రవీంద్ర, సునీతగా పోలీసులు గుర్తించారు. రవీంద్ర సిద్దిపేటలో ఫ్రేమ్స్ అండ్ ఇంటీరియర్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మణుగూరు నుంచి సిద్దిపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Spread the love

Related News

Latest News