Trending Now

బండి సంజయ్ హుస్నాబాద్‌కి ఏం చేసావో చెప్పు..?

సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 9 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని బలపరుస్తూ సిపిఐ సమావేశం తీర్మానించింది. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలవడానికి సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కార్యదర్శులు, ఏడు మండల కార్యదర్శి లు కలిసి ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తే బాగుండేదని.. నేను ప్రతి సమావేశానికి సీపీఐ మండల కార్యదర్శి లను ఆహ్వానిస్తున్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ.. సీపీఐ నేతలను కలిశారని మంచి స్ఫూర్తిదాయకమైన విద్యార్ధి సంఘం నుండి ప్రజాస్వామ్యమైన అనేక పోరాటాలు చేసి ఇక్కడి వరకు వచ్చినానని భవిష్యత్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సీపీఐ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి బిఫభిప్రాయాలు ఉండవన్నారు.

నేను ఎక్కడ ఉన్న హుస్నాబాద్ నియోజక వర్గం వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్న అని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గౌరవం పెంచుతున్న అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. 30 సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా వచ్చింది. ఇప్పుడు ఇస్ బార్ చార్ సౌ అంటున్నాడు.. 400 సీట్లు అంటున్నారని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారన్నారు. పైకి శ్రీరామ్.. లోలోపల రిజర్వేషన్లకు రాం రాం.. చెబుతున్నారని ఎం చేసామో చెప్పుకోకుండా అక్షింతలు వచ్చాయా..? రాముడు ఫోటో వచ్చిందా అంటున్నారన్నారు. ఈ నియోజక వర్గానికి ఎం చేసారో చెప్పు అని అడిగారు మొదటి, రెండవ విడత పోలింగ్ తర్వాత భారత ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారని అబద్దాలు ఆడుతున్నారు. ఆస్తులు గుంజుకుంటారని చెబుతున్నారు.. ఎప్పుడైనా చేశామా..? ప్రశ్నించారు. నిన్న మోడీ వేములవాడ వస్తే ఆలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తారనుకున్నాం.. వేములవాడ రాజన్న ఆలయంకు కోటి రూపాయలు కాదు కదా.. ఒక కోడె కూడా ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట కరీంనగర్ జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్ రాష్ట్ర కౌన్సిల్ గడిపే మల్లేష్, సీపీఐ నాయకులు ఐలేని సంజీవరెడ్డి, మల్లారెడ్డి, గూడ పద్మ, సత్యనారాయణ, కోహెడ సృజన్ కుమార్, జనగాం రాజ్ కుమార్, పాల్గొన్నారు.

Spread the love

Related News