ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : నిర్మల్ జిల్లాలో భారత్ రాష్ట్ర సమితికి మళ్లీ బిగ్ షాక్ తగిలింది. నెలరోజుల నుండి నిర్మల్ మండలం తో పాటు నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా విభాగాల పదాధికారులు నేరుగా బీఆర్ఎస్ కు రాజీనామాలు సమర్పించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరుతూనే ఉన్నారు. తాజాగా శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉండి రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శిగా వ్యవహరించిన నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ సత్యనారాయణగౌడ్ ఆయన సతీమణి మాజీ జెడ్పి చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్, నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఆదుముల్ల రమాదేవి పద్మాకర్, బిట్లిన్ నవీన్ మేడిపల్లి నరేందర్ లతోపాటు పలువురు మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు బీజే ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడెం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, మున్సిపల్ హైట్రిక్ కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్ లు నేరుగా సత్యనారాయణ గౌడ్ నివాసానికి వెళ్లి వారికి పార్టీలోకి ఆహ్వానించారు. వారు కూడా సానుకూలత చూయించారు. త్వరలో బీజేపీ జాతీయ రాష్ట్రస్థాయి నాయకుల ఆధ్వర్యంలో బీజేపీలో చేరే కార్యక్రమం భారీ ఎత్తున నిర్మల్ లోనే నిర్వహించుకున్నందుకు తగిన భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పలువురికి శాలువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు సామా రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మె రాజు, వడ్డీ రెడ్డి రాజేందర్ రెడ్డి నిర్మల్ మండలం మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ బషీర్ లతోపాటు పలువురు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.