Trending Now

జ్ఞానవాపీ మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..

ప్రతిపక్షం, నేషనల్: జ్ఞానవాపీ మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జ్ఞానవాసీ మసీదు సెల్లార్‌లో పూజలు చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు హిందువులకు అనుమతి ఇచ్చింది. మసీదులో పూజలు ఆపాలంటూ ముస్లిం దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. కాగా, వివాదస్పదమైన జ్ఞానవాసీ మసీదును ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారని హిందువులు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు.. మసీదులో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఏఎస్‌ఐ ఆదేశించింది.

ఆలయంపైనే జ్ఞానవాసీ మసీదు నిర్మించారని ఏఎస్ఐ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో మసీదు సెల్లార్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు హిందువులకు పర్మిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టి వేసి.. హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

Spread the love

Latest News