ప్రతిపక్షం, జూన్ 08: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి బలం చేకూరింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలతో పాటు సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు తుంబూరు దయాకర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో మరిన్ని కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















