ప్రతిపక్షం, జూలై 21: తెలుగు రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరంగల్లో కరువు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
నియోజకవర్గాల వారీగా కరువు పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందిస్తామని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.



















