గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్.. రిమాండ్ తరలింపు: పట్టణ సీఐ మహేష్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 21: హైదరాబాద్‌ లోని దూల్‌పేట్, జగదీర్‌గుట్ట ప్రాంతాలకు చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి మెదక్‌ లో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ పట్టణ సిఐ డి మహేష్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు వద్ద పోలీసులు స వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా స్కూటీ పై వెళ్తున్న చిల్వేరి నిఖిల్, పిట్టల వినేష్, మంద మహేష్ అనే ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా స్కూటీ లో సుమారు 48.42 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 48.42 గ్రాముల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక స్కూటీ ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు ఆయన తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అయినా తెలిపారు.

Spread the love

Related News

Latest News