ఆషాఢ మాస బోనాల ప్రారంభం

  • అందరికీ గోల్కొండ బోనాల శుభాకాంక్షలు.
  • ప్రభుత్వం తరుపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లు పట్టు వస్త్రాలు సమర్పణ

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 16: ఆషాఢ మాస బోనాల ప్రారంభోత్సవాల సందర్భంగా లంగర్ హౌస్ చౌరస్తా లో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున మంత్రులు పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ లు పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ఆషాఢ మాసం లో తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాలు సమర్పించారు. అందరికీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు..తెలిపారు.గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు. అమ్మవారికి భక్తులు సమర్పించే బోనం కేవలం నైవేద్యం మాత్రమే కాదు.. అది మన భక్తికి, విశ్వాసానికి, కృతజ్ఞతకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఆత్మను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప సంస్కృతిక ఉత్సవం బోనాలు అని పేర్కొన్నారు ఈ పవిత్రమైన సందర్భంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా 21 న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఆగస్టు 2 శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు.., ఆగస్టు 9 లాలాదర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ,వివిధ ప్రాంతాల్లో బోనాలు జరుగుతాయని పేర్కొన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. 3 వేల దేవాలయాలకు నిధులు కేటాయించుకున్నామన్నారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని బోనాల పండుగ అంటే హైదరాబాద్ లో ఒక కుటుంబ సమేతంగా కలిసి చేసుకునేది..పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు , ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ , మధుయాష్కి గౌడ్, కార్పొరేషన్ చైర్మన్ లు మెట్టు సాయి కుమార్,నూతి శ్రీకాంత్ గౌడ్, కాల్వ సుజాత,దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు , జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా,ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, ఇతర ముఖ్య నేతలు పలువురు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News