ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే.. తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చింది. మరొ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని తాను ప్రారంభించిన ‘ఆయా రాం- గయా రాం’ సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదే అని సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని కేటీఆర్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశం పైన మాట్లాడాలి.. లేకుంటే ఆయన ఒక హిపోక్రట్ గా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం లేదా స్పీకర్ ద్వారా అనర్హత వెయిట్ వేయించడం ద్వారా తాము చెప్పిందే చేస్తాము.. అబద్ధాలు చెప్పమనే విషయాన్ని దేశానికి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.