Trending Now

మరకలేని మహానుభావుడు దుద్దిల్ల శ్రీపాద రావు : గజ్జెల కాంతం

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తి దుద్దిల్ల శ్రీపాద రావు అని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరకలేని మహానుభావుడు దుద్దిల్ల శ్రీపాద రావుని కొంతమంది దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారని.. అప్పుడు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండిస్తే వాళ్ళు తప్పయిందని ఒప్పుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకి పోతాడాని తెలిసి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు.. కేటీఆర్ పై మండిపడ్డారు. తండ్రి, కొడుకులు ప్రజలు తప్పు తోవా పట్టించే ప్రయత్నంలో ఉన్నారని.. కానీ ప్రజలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. అధికారంలోకి రాగానే ఒక్కొక్కటి అమలు చేస్తుంటే వాళ్లకు తెలియట్లేదని ఫైరయ్యారు.

ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వ్యక్తి దుద్దిల్ల శ్రీపాద రావు..

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు స్పీకర్ గా పని చేశారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు సర్పంచ్ గా, సమితి ఉపాధ్యక్షుడిగా ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుండి వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేశారు. అజాత శత్రువుగా పేరొందిన శ్రీపాదరావును బుచ్చి పంతులు అని పిలిచేవారు. ఆయన మరణానంతరం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఐటి, పరిశ్రమల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కీలక భూమిక పోషిస్తున్నారు.

Spread the love

Related News