ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం రూ.8.61 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు వెల్లడించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని భట్టి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు బ్యాంకులకు రూ.2.86 లక్షల 81 వేల కోట్ల మేర అసలు, వడ్డీ చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని, అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

















