హైదరాబాద్, ప్రతిపక్షం, స్టేట్బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ నిర్వహించే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. గురువారం తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముగిసిన విషయం తెలిసిందే.