ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 11: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పవిత్ర రంజాన్ వేడుకలు గురువారం రోజున ఘనంగా నిర్వహించారు. రామవరం రోడ్డులో గల ఈద్గాలో ఉదయమే ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమామ్ అబ్దుల్ భారీ ప్రత్యేక ఉపన్యాసం చేస్తూ.. రంజాన్ నెల 30 రోజులు కఠిన ఉపవాసాలు చేస్తూ నమాజులు చదవడం సోదర భావం, సహజీవనం, సామరస్య ఐకమత్యానికి ప్రతీక అని.. పేదవాళ్లను గుర్తించి దానం చేయడం చేసిన తప్పులను క్షమించమని కోరడమే రంజాన్ అని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈద్గా స్థలంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆలంగిర్ మజీద్ అధ్యక్షుడు అన్వర్ మాట్లాడుతూ.. రంజాన్ ఏర్పాట్లు చేసిన సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి ముస్లింల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న వాలా నవీన్ బొల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఈద్గా వద్ద ప్రతి ఒక్కరిని కలుస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ ఎండి అయూబ్, ఎండి హసన్, ఎండి షఫీ, ఎండి ముంతాజ్, సయ్యద్ ఇంతియాజ్, ఎండి ఫక్రుద్దీన్, ఈ భాషుమియా, తదితరులు ముస్లింలు పాల్గొన్నారు.