Trending Now

బైంసాలో పోలీసుల కార్డన్ సెర్చ్..

పలు వాహనాలు స్వాధీనం కేసులు నమోదు.. పట్టణ సీఐ రాజా రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 30 : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ కాలనీలో పోలీసులు మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వంద 12 ద్విచక్ర వాహనాలు ,13 ఆటోలు, ఒక ఫోర్ వీలర్ వాహనాలు స్వాధీన పరుచుకున్నారు. ఈ సందర్భంగా భైంసా పట్టణ సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ రోడ్డు రవాణా పోలీస్ శాఖ నియామ నిబంధనలకు సూచనలకు అనుగుణంగా వాహన చోదకులు తమ వాహనాలను వాడుకోవాలని సూచించారు. సంబంధిత వాహనాలకు సంబంధించిన అధికారిక అర్హత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేనియెడల ఆ వాటిని గుర్తించి స్వాధీన పరుచుకోవడంతోపాటు తగిన జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తామన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు పట్టణంలోని ఓవైసీ నగర్ లో పోలీస్ ఉద్యోగులు,సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ను నిర్వహించి పలు వాహనాలను స్వాధీనపర్చుకోవడం జరిగిందన్నారు.

సంఘ విద్రోహక శక్తులు తమ దృష్టికి కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నిషేధిత గంజాయి క్రయ,విక్రయాలు చేసినా చేస్తున్న వారిని సహకరిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పికెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అనేక భద్రత బలగాల చేరుకున్నాయని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో అన్ని వర్గాల వారు తమ ఓటు హక్కును చదివినియోగపరచుకొని అధిక శాతం పోలింగ్ అయ్యేలా చూడాలన్నారు.

Spread the love

Related News

Latest News