ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉండవల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. మలివిడత అభ్యర్థుల ఎంపికపై ఇరువురి మధ్య దాదాపు గంటరన్న పాటు చర్చలు జరిగాయి. రెండో జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని వీరు నిర్ణహించారు. బీజేపీతో పొత్తు అంశాలపై సమాలోచనలు చేయగా.. హస్తిన నుంచి పిలుపు వస్తే త్వరలోనే బాబు, పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశాం ఉంది.