ప్రతిపక్షం, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనను పక్కన పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సునితా లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మెదక్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తీరా ఆ స్థానాన్ని మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డికి ఇవ్వడంతో మదన్ రెడ్డి నారాజ్ అయ్యారు. స్వయంగా పార్టీ అధినేత ఇచ్చిన హామీలకు కూడా బీఆర్ఎస్‌లో విలువ లేదని ఆయన తన సన్నిహితులు వద్ద అసహనం వ్యక్తం చేశారు.