రూ.2 వేల కోట్ల స్కామ్ ఎక్కడుంది?.. హరీశ్ ఆరోపణలను ఖండించిన పొన్నం

ప్రతిపక్షం, జూన్ 17: గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. సంక్షేమ శాఖల టెండర్ల మొత్తం విలువే ఆ మొత్తానికి తక్కువగా ఉన్నప్పుడు రూ.2 వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పడం అవాస్తవమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత టి. హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు.

తనపై చేసిన ఆరోపణలు నిజమని రుజువు చేస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నానని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు చెందిన మంత్రులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలకు బదులుగా వాస్తవాలను వెల్లడించాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు.

Spread the love

Related News

Latest News